టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఎప్పుడూ కూడా సరికొత్తదనానికి పరిచయం చేసేనట్టులలో రామ్ చరణ్ కూడా ఒకరు. మొదట చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నటుడు ఆ తర్వాత పలు బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి స్టార్ హీరోగా పేరుపొందారు. ఇటీవలే విడుదలైన rrr చిత్రంతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ చూసి హాలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఫిదా అయ్యారు.


టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. ఇక అలాగే రామ్ చరణ్ అభిమానులు కూడా మగధీర సినిమాని రీ రిలీజ్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి, మురారి వంటి సినిమాలు విడుదల చేయగా అలాగే పవన్ కళ్యాణ్ నటించిన జల్సా ,ఖుషి వంటి చిత్రాలను కూడా విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా మగధీర సినిమాతో మెగా అభిమానులకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం


అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు గీత ఆర్ట్స్ నుంచి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. కానీ ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. రెండవ సినిమాకే స్టార్ హీరో గా గుర్తింపు పొంది..రాజమౌళి దర్శకత్వంలో నటించడంతో మంచి పాపులారిటీ సంపాదించారు రామ్ చరణ్. ఈ సినిమాకి అప్పట్లో రూ.45 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందట ఈ సినిమాకి ప్రతిఫలంగా మూడింతలు రెట్లు లాభం వచ్చిందని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నట న అద్భుతంగా నటించారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: