ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉన్నాడు తమన్. గత కొంతకాలం నుంచి ఇక తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఇతని హవా నడుస్తూ ఉంది అని చెప్పాలి. అయితే కాపీ పాటలే ఎక్కువగా ఉంటాయని ఒకవైపు నుంచి విమర్శలు వస్తున్న ఇక దర్శక నిర్మాతలు అందరూ కూడా తమ సినిమా కోసం తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందని భావిస్తున్నారు. అంతే కాదు యూత్ అందరూ కూడా ఈ మ్యూజిక్ మేనియాలో ముందుకి తేలుతూ ఉన్నారు అని చెప్పాలి.


 గత కొన్ని రోజుల నుంచి తమన్ ఇక స్టార్ హీరోల సినిమాలకు అందిస్తున్న అద్భుతమైన పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఎన్నో రికార్డులు కూడా కొల్లగొడుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే 2023లో సైతం సంక్రాంతికి తమన్ వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తే దేవిశ్రీప్రసాద్ వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ వరకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే.


 దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా కూడా ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురవుతూ ఉంది. అయితే ఇటీవలే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి కూడా ఇలాంటి ప్రశ్న ఎదురయింది అని చెప్పాలి. త్రిబుల్ ఆర్ మూవీ తో తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయికి రాజమౌళి తీసుకెళ్లారు. ఇక నాటు నాటు పాట ఆస్కార్ బరిలో  కూడా ఉంది. దీనిపై మీ స్పందన ఏంటి అంటూ థమన్ ను అడగగా.. మా డైరెక్టర్ త్రివిక్రమ్ మమ్మల్ని ఆస్కార్ అవార్డు స్థాయికి తీసుకువెళ్తారు అంటూ చెప్పాడు తమన్. దీంతో ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా తీయని త్రివిక్రమ్ మిమ్మల్ని ఆస్కార్కు తీసుకువెళ్తాడ అంటూ కొంతమంది ట్రోల్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. కాగా మహేష్ త్రివిక్రమ్ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: