పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బాగా బిజీ గా వున్నారు. అయినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ వున్నారు. కొత్త సినిమాలకు కూడా ఒప్పుకుంటున్నారు అలాగే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు పూర్తి చేయకుండానే వరుస సినిమాలను ఆయన ప్రకటిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఒక్క సినిమా అయిన పూర్తి చేయమని కోరుతున్నారట..

సినిమాలు అయితే ప్రకటిస్తున్నాడు కానీ వాటిని పూర్తి చేయడంలో మాత్రం ఆయన విఫలం అవుతున్నారు.. వీరమల్లు సినిమా షూట్ రెండేళ్ల క్రితమే మొదలు పెట్టిన ఇప్పటికి కూడా పూర్తి చేయలేదు.

సినిమా పూర్తి కాకుండానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబోలో గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది.ఇప్పుడు ఇదే కాంబోలో  మరో సినిమా రాబోతుంది అని పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ సినిమా తేరి సినిమాకు రీమేక్ గా రాబోతున్నట్లు సమాచారం.

పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను హరీష్ శంకర్ తీయబోతున్నారని సమాచారం.. ఇదిలా ఉండగా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. తేరి సినిమాలో విజయ్ కూతురుగా మీనా కూతురు అయితే నటించింది. ఈ సినిమాలో కూతురు పాత్ర అయితే చాలా కీలకం... మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూతురుగా ఎవరు నటిస్తారు అనే విషయంలో మాత్రం ఆసక్తి నెలకొంది.అల్లు అర్జున్ కూతురు అర్హ ఇప్పటికే శాకుంతలం సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా అయితే ఎంట్రీ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో బన్నీ కూతురును ఈ సినిమాలో పవర్ స్టార్ కూతురు పాత్రలో తీసుకోవాలని హరీష్ శంకర్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే అల్లు అర్జున్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: