టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్న రామ్ చరణ్ ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ తన పవర్ఫుల్ నటనతో అభిమానులందరినీ కూడా మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా రామ్ చరణ్ మారిపోవడంతో అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు.


 కాగా ప్రస్తుతం రామ్ చరణ్ వైవిద్యమైన దర్శకుడు శంకర్ తో ఒక సినిమాను తీస్తూ ఉన్నాడు . RC 15 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడం తప్ప ఇక అఫీషియల్ అప్డేట్ మాత్రం రావడం లేదు. దీంతో ఈ అప్డేట్ కోసం అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు అని చెప్పాలి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఈ సినిమా వెంటనే విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేదు.


 శంకర్ ఒకే సమయంలో చరణ్ సినిమాతో పాటు కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ బాధ్యతలు కూడా చూసుకుంటూ ఉండడంతో ఈ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తుంది అని చెప్పాలి.  కనీసం ఇక ఈ ఏడాదిలో అయినా విడుదల చేస్తారేమో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న బాజీ ప్రకారం చరణ్ సినిమా ఈ బజ్ ప్రకారం ఈ ఏడాది కూడా సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే అభిమానులకు వెయిటింగ్ తప్పదు అనే టాక్ తెరమిదికి వచ్చింది. అయితే దీనిపై అటు అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: