
అసలు విషయంలోకి వెళితే ఈ సినిమా డైరెక్టర్ విఎన్ ఆదిత్య స్టోరీని మొదటిగా మహేష్ బాబుతో చేద్దామని అనుకొని కథ చెప్పగా.. మహేష్ బాబుకు కథ పెద్దగా నచ్చకపోవడంతో తాను చేయనని రిజెక్ట్ చేశారట. దాంతో ఈ సినిమాను ఉదయ్ కిరణ్ దగ్గరికి తీసుకెళ్లగా.. ఉదయ్ కిరణ్ సినిమా కథ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉదయ్ కిరణ్ కు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అలా మహేష్ బాబు ఒక మంచి సూపర్ హిట్ సినిమాలు వదులుకున్నాడు.
ఇకపోతే ఉదయ్ కిరణ్ వరుసగా మూడు సినిమాలు చేసి భారీ హిట్ కొట్టిన తర్వాత పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని కారణాలవల్ల ఆయన తీసిన సినిమాలు పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేదు. దీంతో ఆయన కెరియర్ కూడా చాలా డౌన్ అయింది. కెరియర్ లో అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా చేయని మహేష్ బాబు మాత్రం హిట్స్ మీద హిట్స్ అందుకుంటూ సూపర్ స్టార్ గా ఎదిగిపోయారు. మనకు రాసి పెట్టింది మాత్రమే మనకు వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు