పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఏ  ఏమ్ రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ను చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రారంభించినప్పటికీ మధ్యలో కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఇప్పటివరకు కూడా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇంకా 40% వరకు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ షూటింగ్ ను పూర్తి చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల నుండి ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం మరి కొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాతే ఈ సినిమా టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఈ  మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతవరకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసే ఆలోచన చిత్ర బృందానికి లేనట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు మూవీ సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ , సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" మూవీలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: