
ఈ క్రమంలోనే మొన్నటి వరకు బోయపాటితో సినిమా అంటేనే భయపడిపోయిన హీరోలు ఇక ఇప్పుడు సక్సెస్ లోకి వచ్చిన బోయపాటితో సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒక సినిమాను చేస్తూ ఉన్నాడు బోయపాటి. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామ్ మార్కెట్ తో సంబంధం లేకుండా అంచనాలకు మించి నిర్మాతలు కూడా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు టాక్ ఉంది.
ఇదిలా ఉంటే.. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అయితే ఈ సినిమా చేయాలా వద్దా అన్నది మాత్రం రామ్ సినిమా ఫలితం పైన ఆధారపడి ఉంటుంది అన్న టాక్ వినిపిస్తుంది. ఒకవేళ బోయపాటి - రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా హిట్ అయితేనే అటు బన్నీ బోయపాటి సినిమా ఉంటుందట. ఇలా హిట్ అయితేనే బన్నీ బోయపాటికి ఛాన్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడట. గతంలో వీరి కాంబినేషన్లో సరైనోడు సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే హిట్టు పడితేనే అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తాడేమో అనే ఒక టాక్ తెరమీదకి వచ్చింది అని చెప్పాలి. ఇక మరోవైపు బాలయ్య బోయపాటి కాంబినేషన్లో మరో సినిమా కూడా తెరకేక్కాల్సి ఉంది అన్న ప్రచారం కూడా ఉంది.