తెలుగు లో మృణాల్ ఠాకూర్ కి మంచి క్రేజ్ వచ్చింది.క్యూట్ లుక్స్ లో డీసెంట్ యాక్టింగ్ తో మృణాల్ ఠాకూర్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది.తనలో మంచి నటితో పాటు ఓ కమర్షియల్ హీరోయిన్ కూడా ఉందని మృణాల్ ఠాకూర్ ఆ మధ్య కామెంట్స్ కూడా చేసింది. ఇప్పుడు ఆ కామెంట్స్ కి తగ్గట్టుగానే, అమ్మడు తన సినీ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుందని సమాచారం.. తనకు వచ్చిన ఇమేజ్ ను కాపాడుకోడానికి మృణాల్ ఠాకూర్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. మొదట్లో నిర్మాతలు ఎంత ఇస్తే అంత అయితే తీసుకునేది. కానీ, సీతారామం లాంటి హిట్ పడ్డాక తన ఆచి తూచి అడుగేస్తుంది.

 స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ ల కోసం మృణాల్  ప్రయత్నాలు బాగా చేస్తోంది. అందుకే చిన్న హీరోలకు మృణాల్ ఠాకూర్ దూరంగా ఉంటుందని సమాచారం.మృణాల్ ఠాకూర్ ఒక్కో సినిమాకి ఇప్పుడు సుమారు కోటిన్నర అడుగుతుందని సమాచారం.. పైగా హీరో రేంజ్ ను బట్టి డబ్బులు డిమాండ్ చేస్తోందని తెలుస్తుంది.. మొత్తానికి మృణాల్ ఠాకూర్ చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ ఎలా ఉండాలో తెలుసుకుంది.. పైగా సీనియర్ హీరోయిన్స్ కే సాధ్యం కానీ, కొన్ని మేనేజ్ మెంట్లను కూడా మృణాల్ ఠాకూర్ చాలా సింపుల్ గా మ్యానేజ్ చేసుకుంటూ పోతుందని సమాచారం..

సీరియల్ నటిగా మృణాల్ ఠాకూర్ ప్రయాణం మొదలు అయ్యింది. తెలుగు ఇండస్ట్రీ వ్యవహారాలను మృణాల్ చాలా త్వరగా నేర్చుకుంది.. మృణాల్ ఠాకూర్ కి అటు తమిళంలో కూడా సినిమాలు బాగానే వస్తున్నాయి. పైగా ఏ ఇండస్ట్రీకి వెళ్లిన కూడా ఆ ఇండస్ట్రీ పద్దతులను బాగా ఫాలో అవుతూ అక్కడ హీరోలను డైరెక్టర్లను మృణాల్ ఠాకూర్ ఇంప్రెస్స్ చేస్తుంది.. ఈ మధ్య మృణాల్ ఠాకూర్ గ్లామర్ డోస్ కూడా బాగా పెంచింది. స్టార్ హీరోలను నిర్మాతలను కూడా రెగ్యులర్ గా కలుస్తోంది. బడా ఛాన్స్ ల కోసం తన వంతుగా మృణాల్ ఠాకూర్ బాగా ప్రయత్నిస్తుంది..ఘాటుగా అందాల ప్రదర్శన చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: