నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి అనే సినిమాతో ఇటీవల సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే బాలయ్య కెరియర్ లో సింహ అనే పదం బాగా కలిసి వచ్చింది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే బాలయ్య కెరియర్ లో సింహా అనే పేరుతో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సినిమాలు ఏవి అన్నది ఒకసారి తెలుసుకుందాం..

 జై సింహా : 2018లో బాలకృష్ణ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన జై సింహా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

 సింహ : బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా 2010లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా సూపర్ హిట్ అయింది. బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించాల్సిన  నిలిచింది అని చెప్పాలి.

 లక్ష్మీ నరసింహ : బాలయ్య కెరియర్ లో మాస్ హిట్గా నిలిచిన సినిమా లక్ష్మీనరసింహ. తమిళంలో విక్రమ్ హీరోగా నటించిన సామి సినిమాకు తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

 సీమ సింహం : 2002లో బాలయ్య హీరోగా సిమ్రాన్ హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలు బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.

 నరసింహారాయుడు : బాలయ్య కెరియర్ లో ఎవర్ గ్రీన్  చిత్రంగా నిలిచిన నరసింహనాయుడు సినిమా బి.గోపాల్ దర్శకత్వంలో 1999లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్గా కొనసాగిన మూవీగా నరసింహనాయుడు నిలిచింది. 6 కోట్ల బడ్జెట్లో వచ్చి 20 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.

 బొబ్బిలి సింహం : 1994లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

 లయన్ : సింహం అర్థం వచ్చేలా 2015లో సత్యదేవ్ అనే కొత్త దర్శకుడుతో బాలయ్య చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: