తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య ప్రస్తుతం వరుస మూవీ లతో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే సినిమాలతో పాటు ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శేర వేగంగా జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ తో నాగ చైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

నాగ చైతన్య తన కెరియర్ లో నటిస్తున్న మొట్ట మొదటి వెబ్ సిరీస్ కావడంతో ఈ సిరీస్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దూత అనే వెబ్ సిరీస్ తో పాటు నాగ చైతన్య "కస్టడీ" అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కి ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తూ ఉండగా , యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో చైతు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అరవింద్ స్వామి , ప్రియమణి ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క నైజాం హక్కులను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అమ్మివేసినట్లు ... ఈ మూవీ యొక్క నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజు భారీ రేటుకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: