పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా ఈయనని చాలామంది దేవుడు దేవుడు అని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొంతమందికి దేవుడు అయితే మరి కొంతమందికి శత్రువు అని కూడా అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ని ప్రశంసించే వారు చాలామంది ఉంటారు ఆయనను విమర్శించేవారు కూడా అదే సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే ఆ విమర్శలు కాస్త మరింత ఎక్కువ అయ్యాయి. మొదటి నుండి చూసుకుంటే పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అని చెప్పాలి. అయితే ఒకప్పుడు తనని ఎన్ని విధాలుగా మాటలతో బాధపెట్టినప్పటికీ స్పందించని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఎంతటి వారైనా తనని మాటలతో విమర్శిస్తే తనదైన శైలిలో మాటలు విసిరి సమాధానమిస్తున్నాడు.  

సాధారణంగా కొందరు ఏదైనా అంటే ముందు ఉండి మాట్లాడుతారు కొంతమంది వెనుక నుండి మాట్లాడుతారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రెండు దారులలో సమాధానం ఇస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే ఎంతో మంది పవర్ స్టార్ ని దేవుడిగా కొలిచినప్పటికీ ఆయనలో ఒక చెడ్డ కూడా ఉందని అదే జాలి దయ అని అంటున్నారు చాలామంది. అంతే కదా దానికి ఒక బలమైన కారణం కూడా ఉంది అని అంటున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి ఇటీవల పవన్ కళ్యాణ్ వచ్చి రాజకీయాల గురించి చాలా విషయాలను పంచుకోవడం జరిగింది.

అంతేకాదు మూడు పెళ్లిళ్ల గురించి వస్తున్న ట్రోల్స్ పై కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే మూడు పెళ్లిళ్లపై  చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు... నాకు తెలిసిన ఆ విషయం తప్ప నన్ను విమర్శించడానికి వాళ్ళ దగ్గర మరే విషయం లేదు అని విమర్శించినంతవరకు విమర్శించండి అని అదొక్కటే వాళ్ళకి తెలుసు అని అది నేను కావాలని చేసిన తప్పు కాదు అని అలా జరిగిపోయింది అంటూ చెప్పవచ్చాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ని ట్రోల్స్ చేస్తున్నప్పటికీ పోనీలెండి వదిలేయండి అని సొంత వారిని నమ్మొచ్చు కానీ రాజకీయాల్లో ఉన్న సొంత వారిని కూడా నమ్మలేము అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. నాలో జాలి దయ అనే బ్యాడ్ క్వాలిటీస్ కుండడం వల్లనే నేను పూర్తిగా రాజకీయ నాయకుడిగా ఇంకా మారలేదు అని చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: