
ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి మంచి విజయాలను అందుకొని.. భారీ జోష్ మీద ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ విజయ పరంపర కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూసి చిత్ర యూనిట్ ప్రేక్షకుల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అది చూసి ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటంటే ఈ చిత్రం బుధవారం రోజు అనగా ఈరోజు ఆడవాళ్లకు 30 సెలెక్టివ్ థియేటర్స్ లో ఉచితంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా మూవీ యూనిట్ అధికారికంగా స్పష్టం చేసింది ఇకపోతే ఇప్పటివరకు ఏ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా ఇలాంటి పని చేయలేదు. మహా అయితే కేవలం టికెట్ల రేట్లు మాత్రమే తగ్గించారు కానీ ఏకంగా మహిళల కోసం ఉచితంగా టికెట్లు అందిస్తున్నారంటే మూవీ టీం కి ఆడవాళ్ళ పైన ఏవిధంగా గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా బలంగా లాంగ్ రన్ లో కొనసాగాలి అంటే మహిళలు థియేటర్స్ కి కదిలితేనే అనే ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు నిజం చేయబోతున్నారు.