తమిళ హీరో విజయ్ సేతుపతి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ్ నటుడు విజయ్ సేతుపతికి కేవలం కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ బాలీవుడ్ మరియు ఇతర భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. అంతేకాదు ఏడాదికి దజనుకు పైగానే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి.వివిధ భాషలలో సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. 

అంతేకాదు ఆయన అభిమానులు విజయ్ సేతుపతిని పాన్ ఇండియా స్టార్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలోని విజయసేతుపతి ఒక సందర్భంలో నన్ను కొందరు పానండియా స్టార్ అంటూ పిలుస్తున్నారు.. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది.. నేను కేవలం నటుడిని మాత్రమే.. నటుడు అంటే అన్ని భాషల్లో నటించాల్సి వస్తుంది.. నేను కూడా అలాంటి ఒక నటుడిని.. నేను కూడా అన్ని భాషల్లో నటించాలని అనుకొని అందరూ నటిస్తున్న సినిమాల్లో నటిస్తూ ఉంటాను..నన్ను అందరూ పాన్ ఇండియా నటుడు అనడం నాకు అస్సలు నచ్చడం లేదు ..అంటూ చెప్పవచ్చాడు విజయ్ సేతుపతి. అంతేకాదు పాన్ ఇండియా హీరో అంటూ నన్ను పిలుస్తుంటే నేను ఒత్తిడికి గురవుతున్నట్లుగా

 నాకు అనిపిస్తుంది.. సినిమాల్లో నటించడం అనేది నా కర్తవ్యం.. అది ఏ భాష అయినప్పటికీ కూడా అన్ని భాషల ప్రేక్షకులను అలరించడమే నటుడి బాధ్యత.. అన్ని భాషల ప్రేక్షకులను అలరించే విధంగా నటించాలి అని నేను భావిస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన తెలుగు హిందీ భాషల్లోనే కాకుండా భవిష్యత్తులో పంజాబీ మరాఠీ గుజరాతి మరియు బెంగాలీ భాషల్లో కూడా సినిమాల్లో చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపాడు. ఇన్ని భాషల్లో నటిస్తున్నప్పటికీ ఆయన పాన్ ఇండియా నటుడు ని కాదు అని.. కేవలం నటుడిని మాత్రమే అంటూ నటుడు అనే పదానికి దయచేసి ఎలాంటి త్యాగని తగిలించవద్దు అని.. అది తనకి ఇష్టం లేదు అంటూ పేర్కొన్నాడు విజయ్ సేతుపతి.ఇదంతా చూస్తుంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటే ఏదైనా అన్నట్లుగా విజయసేతుపతి మాట్లాడడంతో ఈయనపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: