ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తరువాత తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఏకంగా 1250 కోట్ల పైగా వసూళ్లు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లకి అయితే దేశావ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.కానీ సోషల్ మీడియాలో మాత్రం రామ్ చరణ్ కి ఫాలోయింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయింది.  ఎన్టీఆర్ కన్నా సోషల్ మీడియాలో డబుల్ లెవెల్లో రామ్ చరణ్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. టాలీవుడ్ లో  ఫాస్టెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ కొద్దీ ఫాలోవర్స్ ని  అందుకుంటూ రికార్డులు సెట్ చేసాడు రామ్ చరణ్. అలాగే ఇప్పుడు మరో ఫాస్టెస్ట్ రికార్డుని కూడా తాను అందుకొని ఇంకో రికార్డుని సెట్ చేశారు.


ఇప్పుడు రామ్ చరణ్ 12 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని అందుకొని మరో సూపర్ రికార్డుని తన ఖాతాలో  వేసుకున్నాడు. దీనితో సోషల్ మీడియాలో రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదని అతని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తుండగా ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది.ప్రస్తుతం రెండు చిన్న సినిమాలకు అయ్యేంత బడ్జెట్ తో ఈ సినిమాలో ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: