జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... అలాగే అనేక మూవీ లలో నటిస్తూ కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్న సుదీర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే సుధీర్ ఇప్పటికే కొన్ని మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా తాజాగా సుదీర్ "గాలోడు" అనే మూవీ లో హీరో గా నటించాడు. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌ పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో గెహనా సిప్పీ , సుదీర్ సరసన హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ మూవీ కి సంగీతాన్ని ఇచ్చాడు. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఈ మూవీ లో కీలక పాత్రలలో పోషించారు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది. 

మూవీ ద్వారా హీరో గా సుధీర్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవా లేదు అనే రేంజ్ విజయం అందుకున్న ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. తాజాగా ఈ మూవీ "ఓ టి టి" విడుదలకు తేదీ కి సంబంధించిన అప్డేట్ కూడా వెలువడింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: