మంచు మనోజ్ రెండవ పెళ్లి నిన్న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు దిగవంత నేత భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డి తో మనోజ్ సోదరి మంచు లక్ష్మి స్వగృహంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి చాలా తక్కువ మంది బంధుమిత్రులు వచ్చారు. ఇక సినీ ఇండస్ట్రీ నుండి అయితే కేవలం ఇద్దరు ముగ్గురే పెళ్లికి రావడం జరిగింది. ఇకపోతే మనోజ్ సోదరుడు మంచు విష్ణు కేవలం 15 నిమిషాలు మాత్రమే పెళ్ళిలో పాల్గొన్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తన సొంత సోదరి పెళ్లిలో కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉండడంతో నిజంగానే వీరిద్దరి మధ్య విభేదాలు 

ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక మరోవైపు మంచి మోహన్ బాబుకి కూడా ఈ పెళ్లంటే ఇష్టం లేదు అని అంటున్నారు. కేవలం మంచు లక్ష్మి బలవంతం మేరకే మోహన్ బాబు ఈ పెళ్లికి ఒప్పుకున్నారని.. అందుకే ఈ పెళ్ళికి కూడా వచ్చానని గత కొంతకాలంగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇకపోతే మంచు మనోజ్ రెండో పెళ్లికి మోహన్ బాబు భారీ మొత్తంలో కట్నం కూడా డిమాండ్ చేశాడని సుమారుగా 80 కోట్లకు పైగానే విలువచేసే ఆస్తులను ఆయన కట్నంగా పొందాలని అప్పుడే ఈ పెళ్లికి ఆయన ఒప్పుకుంటారు అన్న వార్తలు కూడా రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం

ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని తెలుస్తుంది. మోహన్ బాబు ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదని పెళ్లికి కూడా తన సొంత డబ్బులు ఖర్చు చేయలేదని మొత్తం మంచు లక్ష్మి ని దగ్గర ఉండి అని సమాచారం. వీరిద్దరి పెళ్లి ముందు వరకు వీరిద్దరి పెళ్లికి సంబంధించిన రకరకాల రూమర్లు వచ్చాయి. అయినప్పటికీ వీరిద్దరి పెళ్లి గురించి మాత్రం కొంచెం కూడా క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే చాలాసార్లు వీరిద్దరూ బయట కలిసి తిరుగుతూ కనిపించారు. కానీ పెళ్లి గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకులు చెప్పేవారు. మొత్తానికి అకస్మాత్తుగా నిన్న ఉదయం ఆయన పెళ్లి జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: