ఈ నెలాఖరుకు విడుదలకాబోతున్న ‘దసరా’ పై విపరీతంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గుగనుల నేపధ్యంలో అల్లబడిన ఒక మాస్ పాత్రకు సంబంధించిన సినిమా ఇది. ఈసినిమాకు సంబంధించిన చాల సన్నివేశాలలో నాని మాసిన లుంగీ బనీన్ తో చాల మొరుటుగా కనిపిస్తాడు. సింగరేణి బొగ్గు కార్మీకులు జీవితాలను బగా స్టడీ చేసి ఈమూవీకి సంబంధించిన నాని బాడీ లాంగ్వేజ్ ను దర్శకుడు శ్రీకాంత్ డిజైన్ చేసాడు.  


ఈసినిమాకు సంబంధించి నాని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు. ఈసినిమాలో తనది ఒక రఫ్ క్యారెక్టర్ కావడంతో ఆపాత్ర స్వభావం రీత్యా అతడు సింగరేణి ప్రాంతాలలో చాలామంది కార్మికులు తాగే ‘పావా’ తీసుకునే అలవాటు ఉంటుందని చెప్పాడు. అయితే తాను ఈపాత్రలో నటించే సమయంలో ఆర్టిఫియల్ ఆల్కాహాల్ తీసుకుని ఎన్నిసార్లు నటించినా దర్శకుడు శ్రీకాంత్ ఆ షాట్ ను ఓకె చేయలేని పరిస్థితులలో ఇక తప్పక తాను నిజంగానే పావా తాగి నటించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నవిషయాన్ని షేర్ చేసాడు.


అయితే ఆ పావా తీసుకోగానే తన కడుపు విపరీతంగా తిప్పి వాంతులు అయ్యే ఫీలింగ్ వచ్చిందని అయితే ఆ ఫీలింగ్ ను తట్టుకుని తన డైలాగ్ ను అదేవిధంగా ఆ సీన్ ను పూర్తి చేయడానికి తనకు చుక్కలు కనిపించాయి అంటున్నాడు. ఇదే సందర్భంగా మరొక విషయాన్ని షేర్ చేస్తూ ఈ సినిమాలో ఒక బొగ్గు లారీ నుండి దూకి ఫైట్ చేయవలసిన సీన్ ఉందని అయితే అలా దూకడంలో తన కాలు స్లిప్ అవ్వడంతో తాను కిందపడినప్పుడు దుమ్ముతో నిండిన తన శరీరం చూసి తాను చాల భయపడ్డాను అని అంటున్నాడు.


ఈమూవీతో నాని తనకు మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ హిట్ వస్తుంది అని భావిస్తున్నప్పటికీ ఈమూవీని టార్గెట్ చేస్తూ హిందీలో అదేవిధంగా తమిళంలో కొన్ని భారీ సినిమాలు విడుదల అవుతూ ఉండటం నానీకి ఊహించని షాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: