ఇండియా లోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం కొంత కాలం క్రితం ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇండియా వ్యాప్తంగా దర్శకుడుగా తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న మణిరత్నం ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకో లేక పోయాడు.

ఇలా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన మణిరత్నం తాజాగా పోన్నియన్ సెల్వన్ పార్ట్ 1 అనే మూవీ ద్వారా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం భారీ అంచనాల నడుమ తమిళ్ భాష తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ లో విక్రమ్ , కార్తి , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా రెండవ భాగం షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది.

 ఈ మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మొదటి పాటకు సంబంధించిన గ్లింమ్స్ వీడియోను తాజాగా విడుదల చేసింది. ఈ వీడియోకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ పాట కార్తీ మరియు త్రిష లాపై కొనసాగనుంది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: