ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ తన తదుపరి మూవీ లను కూడా అదే రేంజ్ లో ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అందులో భాగంగా ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తర్వాత దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో రామ్ చరణ్ హీరో గా నటిస్తున్నాడు.

మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ "ఉప్పెన" మూవీ దర్శకుడు అయినటు వంటి బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ షూటింగ్ ను నవంబర్ నుండి మొదలు పెట్టనున్నట్లు ... అలాగే ఈ మూవీ లోని తన పాత్ర రంగస్థలం మూవీ లోని చిట్టి బాబు పాత్ర కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్టు రామ్ చరణ్ వివరించాడు.

సినిమా గురించి రామ్ చరణ్ చాలా గొప్పగా చెప్పడంతో ఈ మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ కి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత కన్నడ దర్శకుడు నర్తన్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 17 వ మూవీ గా రూపొందబోతుంది. ఇలా రామ్ చరణ్ అదిరిపోయే రేంజ్ ఉన్న దర్శకులతో తన తదుపరి మూవీ లను సెట్ చేసి పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: