ఎట్టకేలకు కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్మూవీ ప్రారంభోత్సవానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది. ఈమూవీని ఈనెల 23న ప్రారంభిస్తున్నారు. దీనితో ఈమూవీ కోసం కొరటాల పడిన శ్రమకు ఒక మార్గం సులువైంది అన్నకామెంట్స్ వస్తున్నప్పటికీ ఈమూవీని పాన్ ఇండియా మూవీగా అంచనాలకు తగ్గట్టుగా తీయడం అంత సులువైన పనికాదు అన్నమాటలు కూడ వస్తున్నాయి.


పరాజయం అన్న పదాన్ని ఎరగని కొరటాల కు ‘ఆచార్య’ ఫెయిల్యూర్ మైండ్ బ్లాక్ చేసి కనువిప్పు కలిగించింది. దీనితో ఎలర్ట్ అయిన జూనియర్ కూడ కొరటాల తనకోసం అప్పటికే తయారుచేసిన కథలో అనేక మార్పులుచేర్పులు చేయవలసి వచ్చింది. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత చరణ్ జూనియర్ ల మధ్య స్నేహం అలాగే కొనసాగుతూ ఉన్నప్పటికీ వారిద్దరి మధ్య పోటీమటుకు తారా స్థాయికి చేరుకుంది అన్నఅంచనాలు ఉన్నాయి.


ఇప్పటికే రామ్ చరణ్ తన ఇమేజ్ ని బాలీవుడ్ లో అదేవిధంగా హాలీవుడ్ లో పెంచుకునే విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని తనకు అనుకూలంగా చక్కగా మలుచుకున్నాడు అన్నఅభిప్రాయాలు జూనియర్ అభిమానులలో ఉన్నాయి. దీనికితోడు జూనియర్ గత కొంతకాలంగా ప్రతి విషయంలోనూ ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో తన వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు. ఈమౌనంతో అనేక సందేహాలు కలుగుతున్నాయి.


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో జూనియర్ కు ఏర్పడ్డ పాన్ ఇండియా ఇమేజ్ నిలబడాలి అంటే కొరటాల శివ మూవీతో అదిరిపోయే బ్లాక్ బష్టర్ హిట్ కొట్టి తీరాలి. ఇప్పటికే ఈమూవీ పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రియల్ 5న విడుదల తేదీ అంటూ చాల ముందుగానే ఈమూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దీనికితోడు ఈమూవీలో జాన్వీ కపూర్ నటిస్తూ ఉండటంతో అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఇప్పటికే విడుదలైన ఈమూవీకి సంబంధించిన పోష్టర్లలో ఉన్న సముద్రాన్ని చూసి ఎవరికి వారు పోర్టు స్మగ్లింగ్ మాఫియా అంటూ ఏవో ఊహించుకుంటున్న పరిస్థితులలో కొరటాల పై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: