విశ్వక్ దాస్ కా దమ్కి ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. సినిమా విడుదలకు ముందే కాస్త హైప్ పెంచే ప్రయత్నాలు బాగా చేసాడు విశ్వక్ సేన్.
గతంలో ఆయన చేసిన పిచ్చి ప్రయోగాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమాను ఎలా కొత్తగా మార్కెట్ చేయడం అనేది తన మొదటి సినిమా నుంచే నేర్చుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు కూడా తనదైన రీతిలో ప్రయోగాలు చేసుకుంటూ వెళుతున్నాడటా.ఇక తన సొంత ప్రొడక్షన్ లో తానే దర్శకుడిగా, హీరోగా అలాగే నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ అన్ని బాధ్యతలను తన భుజాలపై మోస్తూ దాస్ కా ధమ్కి అనే ఓ సినిమాను తీసినట్లు తెలుస్తుంది.

సినిమా మొదటి షో నుంచే డివైడ్ టాక్ వస్తోంది.అనేక సినిమాల కలయిక గా లేదా కిచిడీగా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా చూస్తారు అనే విషయం పక్కన పెడితే విశ్వక్ కీ మాత్రం ఈ సినిమా అంతా వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్ అయితే కాదు. కిలాడి మరియు ధమాకా సినిమాలను కలిపితే వచ్చిందే దాస్ కా ధమ్కి సినిమా.ఈ సినిమాకి తన తండ్రి కరాటే రాజు పేరు వాడుతూ బాగా హడావిడి చేసి కష్టపడి సినిమా తీసినట్టుగా చెప్పుకుంటున్నాడటా.

ఈ సినిమాలో హైపర్ ఆది చేత డైలాగులు రాయించుకున్నట్టు ఉన్నాడు విశ్వక్ కానీ కథ తానే రాసుకొని స్క్రీన్ ప్లే కూడా మొత్తం తానే చేసుకున్నాడు. టాలీవుడ్ చిత్రాలకు పెద్దవాళ్లు చిత్రాలకు లాజిక్ తో పని లేదు కాబట్టి అలాంటి లాజిక్ లేని సీన్లు ఈ చిత్రంలో ఎన్నో ఉన్నాయి.అసలు ఇవన్నీ పక్కన పెడితే కనుక మితిమీరిన బూతులు, చెత్త వివాదాలు అలాగే తల తోక లేని ఆటిట్యూడ్ తగ్గించుకోకపోతే ముందు ముందు విశ్వక్ సేన్ కి చాలా కష్టాలు వస్తాయి. ఒక టీవీ ఛానల్ లో ప్రమోషన్ కోసం వచ్చి కూడా ఫ్యామిలీ లేడీస్ వాడకూడని ఒక బూతు పదం అయితే వాడేసాడు.ఇక దర్శకత్వం జోలికి పోకుండా కేవలం తన దగ్గరికి వచ్చిన ఏదో ఒక కథలో హీరోగా నటిస్తే చాలు అని సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: