పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమిళ సినిమా అయినటువంటి వినోదయ సీతం కు అధికారిక రీమేక్ గా రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ తెలుగు వర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ రీమేక్ మూవీ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో అనేక మార్పులు ... చేర్పులను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది . అందులో భాగంగా ఈ మూవీ లో సాయి తేజ్ కు ఒక హీరోయిన్ ఉండబోతున్నట్లు ... అలాగే ఈ మూవీ లో రెండు పాటలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కేవలం 25 రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే క్రేజీ అప్డేట్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది .

తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని 28 జూలై 2023 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సంస్థ తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: