టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఒక సినిమాతో హిట్ కొడితే ఆ తరువాత రెండు, మూడు సినిమాలు ప్లాప్ ని మూట గట్టుకోవడం కామన్ అయ్యిపోయింది. చివరిగా 2020 వ సంవత్సరంలో మాత్రం భీష్మ  మూవీతో ఓ డీసెంట్ హిట్ ని అందుకున్నాడు.ఇక ఆ తరువాత చెక్, రంగ్ దే, మాస్ట్రో ఇంకా మాచర్ల నియోజకవర్గం సినిమాలతో వరుస ప్లాపులు అందుకున్నాడు. ప్రస్తుతం రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తన 32వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.తాజాగా మరో కొత్త సినిమాని కూడా లాంచ్ చేసేశాడు నితిన్. చివరిగా తనకి భీష్మ వంటి సూపర్ హిట్టు సినిమాని ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు నితిన్.భీష్మ సినిమా హిట్టు తరువాత వెంకీ కుడుముల చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ అనేక రకాలుగా వార్తలు వినిపించినా, అది ఎందుకో అసలు సెట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు నితిన్ తోనే తన తరువాతి సినిమాని ప్రకటించాడు.


స్టార్ బ్యూటీగా దూసుకుపోతున్న రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, స్టార్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నేడు (మార్చి 24) ఈ మూవీ చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఇక ఈ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి  చీఫ్ గెస్ట్ గా రాగా.. దర్శకులు మలినేని గోపీచంద్, బాబీ, హను రాఘవపూడి, బూచి బాబు ఇంకా అలాగే చిత్ర యూనిట్ హాజరయ్యారు.ఇక హీరో హీరోయిన్లు పై మొదటి సీన్ షూట్ చేయగా చిరంజీవి క్లాప్ కొట్టాడు. డైరెక్టర్స్ గోపీచంద్ అండ్ బాబీ గౌరవ దర్శకత్వం వహించారు.తరువాత హను రాఘవపూడి, బూచి బాబు మూవీ టీంకి స్క్రిప్ట్ ని అందించారు. ఇక భీష్మ సినిమాని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా, ఈ సినిమాని అడ్వెంచర్స్ డ్రామాగా తీసుకు రాబోతున్నట్లు తెలియజేశాడు దర్శకుడు.తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జి వి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. భీష్మ సినిమాతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న ఈ మూవీ టీమ్.. ఈ మూవీతో కూడా విజయాన్ని అందుకుంటారా? లేదా? అనేది మున్ముందు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: