ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఈయన ఇప్పుడు పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోని పలు భారీ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు. మరోవైపు ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీల ద్వారా కూడా దిల్ రాజు హైలెట్ అవుతున్నాడు. ఇటు స్టార్ హీరోల సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టడంతో పాటు అప్పుడప్పుడు చిన్న సినిమాలను కూడా సపోర్ట్ చేస్తూ ఆడియన్స్ కి కంటెంట్ బేస్డ్ మూవీస్ ని అందిస్తున్నాడు. ఇండస్ట్రీలో దిల్ రాజు ఎదుగుతున్న కొద్దీ అతనికి శత్రువులు కూడా ఎక్కువ అవుతున్నారు. 

అతని ఎదుగుదలను చూసి అతనిపై బురద చల్లే వాళ్ళు చాలామంది తయారయ్యారు. అటువంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాడు. అయితే తాజాగా దిల్ రాజుకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. అదే దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ.. గతంలో చాలాసార్లు దిల్ రాజు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. కానీ వాటిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం మరికొద్ది రోజుల్లోనే దిల్ రాజు కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాటి గల కారణాలు కూడా లేకపోలేదు.

ఇటీవల దిల్ రాజు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ నిజామాబాద్ జిల్లాలో సమావేశం అయ్యారు. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో హత్సే హాత్ జోడో అనే యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిర్మల్ లో దిల్ రాజు సొంత గ్రామమైన నర్సింగ్ పల్లి లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినప్పుడు.. ఆలయానికి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించడం దిల్ రాజు. అతనితో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాడు. దీంతో దిల్ రాజు ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడని వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్ తరపున దిల్ రాజు పోటీ కూడా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే దిల్ రాజు స్వయంగా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: