సూపర్ స్టార్ మహేష్ బాబు ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక భారీ బడ్జెట్ క్రేజీ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ మూవీ షూటింగ్ ను ప్రస్తుతం ఈ మూవీ బృందం "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ స్పీడ్ లో పూర్తి చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ మూవీ నిర్మాత అయినటు వంటి సూర్య దేవర నాగ వంశీ ప్రకటించాడు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయడం కష్టమే అని ... ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం మనకు తెలిసింది. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ మూవీ తో పాటు పవన్ ...  సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న వినోదయ సీతం తెలుగు రీమిక్ మూవీ కి కూడా పని చేస్తున్నాడు.

 ఇలా ఉంటే తాజాగా వినోదయ సీతం మూవీ ని జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఫిక్స్ చేసింది. దానితో మహేష్ మూవీ ని మరి కొంత లేటుగా విడుదల చేయాలి అనే ఉద్దేశం తోనే వినోదయ సీతం మూవీ ని జూలై చివరి వారంలో విడుదల చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ.లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: