ఇండియా వ్యాప్తంగా నటి గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సమంత తాజాగా శాకుంతలం అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించగా ... దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ మూవీ ని గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ చాలా భారీ బడ్జెట్ తో నిర్మించారు. 

మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ  , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ముంబై లో శాకుంతలం మూవీ ప్రమోషన్ లలో పాల్గొన్న సమంతసినిమా లోని తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

 తాజాగా సమంత "శాకుంతలం" మూవీ లోని తన పాత్ర గురించి మాట్లాడుతూ ... తన కెరీర్ లో చేసిన బెస్ట్ పాత్రల్లో ఒకటిగా శాకుంతలం మూవీ లోని పాత్ర నిలిచిపోతుందని అన్నారు. ఇటు వంటి గొప్ప పాత్ర చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని సమంత చెప్పుకొచ్చింది. దర్శకుడు గుణశేఖర్ ఎంతో గొప్ప టాలెంట్ కలిగిన వ్యక్తి అని సమంత పేర్కొంది. అలానే ఇంత మంచి టీమ్ తో వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అని సమంత వివరించింది. ఇలా సమంత "శాకుంతలం" మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: