తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఆఖరుగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.గా రూపొందింది.

సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న నాగార్జున తన తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున తన 100 వ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నాగార్జున తన 100 వ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 అలాగే నాగార్జున తన 100 వ మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం నాగార్జున తన కెరీర్ లో 100 వ మూవీ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే నాగార్జున ప్రముఖ కథా రచయిత అయినటువంటి బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రసన్న కుమార్ తాజాగా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నటువంటి ధమాకా మూవీ కి కథను అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: