తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ దర్శకుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ ఆఖరుగా విజయ్ దేవరకొండ హీరో గా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఏ మాత్రం సక్సెస్ సాధించ లేక పోయింది. ఇలా లైగర్ మూవీ ఘోరమైన పరాజయం సాధించడంతో ఆ మూవీ తర్వాత పూరి జగన్నాద్ ఇప్పటి వరకు తన తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించ లేదు.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పూరి జగన్నాథ్ తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని మెగాస్టార్ చిరంజీవి తో చేసే అవకాశాలు ఉన్నట్లు అందు కోసం ప్రస్తుతం పూరి జగన్నాథ్ ... చిరంజీవి కోసం ఒక అద్భుతమైన కథను రెడీ చేస్తున్నట్లు ... ఆ కథను చిరంజీవి కి వినిపించి ... చిరంజీవి కి గనుక ఆ కథ నచ్చినట్లు అయితే పూరి జగన్నాథ్ తదుపరి మూవీ చిరంజీవి తో ఉండే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: