ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని ఎంతో మంది అభిమానులు అభిమానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి తన అందచందాలతో ... నటనతో ప్రేక్షకులను మెప్పించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమంత తాజాగా శాకుంతలం అనే మూవీ లో నటించింది.

 ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో 2D మరియు 3D వర్షన్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సమంత ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

తాజాగా సమంతమూవీ గురించి మాట్లాడుతూ ... గుణశేఖర్ "శాకుంతలం" కథ చెప్పగానే నేను చేయను అని చెప్పేసాను. శాకుంతలం లా నాలో తేజస్సు మరియు రీవీ కనిపించవు అని నా భావన. అందుకే తొలత ఆ మూవీ ని ఒప్పుకోలేదు. కానీ నేను ఏదైనా పాత్ర విషయంలో భయపడ్డాను అంటే కచ్చితంగా ఆ పాత్ర చేయాల్సిందే అని డిసైడ్ అవుతా. అలా శాకుంతలం పాత్ర చేశాను అని సమంత తాజాగా చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే సమంత ఆఖరుగా యశోద మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. మరి శాకుంతల మూవీ తో సమంత ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: