నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటికే ఈ సంవత్సరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వీర సింహా రెడ్డి తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అయినటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు .

మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న బాలకృష్ణ మరో తెలుగు యువ హీరో సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసింది.

మూవీ ప్రస్తుతం మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ రాబడుతు థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ లో విశ్వక్ హీరోగా నటించిన మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ కి సీక్వల్ గా విశ్వక్ "దాస్ కా దమ్కి" 2 మూవీ ని రూపొందించ బోతున్నాడు. ఈ మూవీ లో బాలకృష్ణ ఒక అదిరిపోయే కీలకమైన పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: