టాలీవుడ్ యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'దసరా'. ఎన్నో భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను టాలీవుడ్ కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసి పూర్తిగా రా అండ్ రస్టిక్ మూవీగా ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా రూపొందించారు. ఈ సినిమాలో నటీనటులు అందరూ కూడా డీగ్లామర్ పాత్రల్లో నటించగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఇంకా సాంగ్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను తారా స్థాయిలో పెంచేశాయి.ఇక ఈ సినిమాను నాని తన కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చెయ్యగా విడుదల అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ఈ సినిమా దక్కించుకుంది. దీంతో ఈ సినిమాపై కేవలం ఇండియాలోనే కాకుండా,  ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.


మరీ ముఖ్యంగా యూఎస్‌లో దసరా సినిమా కోసం భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరగడంతో, ప్రీమియర్ల రూపంలోనే అక్కడ దసరా సినిమా దుమ్ములేపినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఇప్పటి దాకా ప్రీమియర్ల రూపంలో ఏకంగా $500K పైగా వసూళ్లు వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.ఈరోజు మొత్తం పూర్తయ్యేసరికి ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దసరా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఇక మున్ముందు రోజుల్లో ఓవర్సీస్‌లో కలెక్షన్ల మోత మోగడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇక నానికి కూడా బలమైన ఫాలోయింగ్ ఉన్న అమెరికాలో దసరా సినిమా మొత్తంగా ఈరోజు ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: