టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో చాలా స్పీడ్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.అందులో బాలీవుడ్ ప్రొడక్షన్లో స్ట్రెయిట్ గా చేస్తున్న సినిమా 'ఆదిపురుష్'.బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్  100వ సినిమా 'తానాజీ' డైరెక్ట్ చేసి ఎంతగానో ఆకట్టుకున్న ఓం రౌత్ దర్శకుడు అనగానే ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు పెరిగాయి..ఇక ఓం పక్కా ప్లాన్‌తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశాడు.. అంతే త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసే సరికి అందరూ కూడా ఎంతగానో షాక్ అయ్యారు..ఎన్నో లక్షల సంవత్సరాల నాటి రామాయణంలోని ఓ భాగాన్ని కథాంశంగా తీసుకుని.. ఇప్పటి తరానికి అత్యున్నత సాంకేతికతో ఇంకా త్రీడీలో విజువల్ వండర్‌గా అందించాలని ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మాతలు.. ఇంకా తెలుగు నిర్మాతలు వంశీ - ప్రమోద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత, సన్నీ సింగ్ లక్ష్మణుడు ఇంకా అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రల్లో నటించారు..అయితే టీజర్ చూసిన తరువాత ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు జనాలు, అభిమానులు కూడా ఎంతగానో షాక్ అయ్యారు.. గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ దర్శకుడిని సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోల్ చేశారు.. దీంతో కొద్ది రోజులు మూవీ టీం ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా బాగా సైలెంట్ అయిపోయింది.. ఓం రౌత్ కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని సీజీ వర్క్ లాంటివి బెటర్ ఔట్ పుట్ వచ్చేలా వర్క్ చేయించాడని సమాచారం తెలుస్తుంది..


2022 ఆగస్టు రిలీజ్ పోయింది.. తరువాత 2023 సంక్రాంతి అన్నారు.. అది పోయింది. ఇక తర్వాత ఇప్పుడు జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల అంటూ డేట్ ఫిక్స్ చేశారు..ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. 'మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్' అంటూ తెలుగు, హిందీ ఇంకా ఇంగ్లీష్ పోస్టర్స్ వదిలారు.. క్యారెక్టర్స్ పెయింట్, స్కెచ్ వేసినట్లు కనిపిస్తున్నాయి కానీ రియల్ అనే ఫీలింగ్ రావట్లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో ప్రభాస్ అభిమానులు ఇంకా నిరాశ చెందుతున్నారు.హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ ఇంకా మలయాళం భాషల్లో మరో 77 రోజుల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది 'ఆదిపురుష్'..

మరింత సమాచారం తెలుసుకోండి: