లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె ప్రేమ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. "నా జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. నా లైఫ్ తెరిచిన పుస్తకం. నా జీవితంలో ఎత్తుపల్లాల్ని పారదర్శకంగా అందరూ చూడొచ్చు. కొన్ని విషయాన్ని దాచిపెట్టడం, ఫేక్ గా ఉండడం నాకు చేతకాని పని నాజీవితం తెరచిన పుస్తకం’ అంటూ ఆమె కొన్ని కామెంట్స్ చేసింది.
జీవితంలో ప్రేమించడం మాత్రమే తెలుసని అయితే కొంతమంది ప్రేమను నటిస్తారని అది తనకు చేతకాదు అని అంటోంది. తన దృష్టిలో ప్రేమ అర్థం మారిపోయిందని అయితే తొలిసారి గడిచిన సంవత్సరకాలంగా తన కుటుంబ సభ్యులు సన్నిహితులు తన అభిమానులు తన పై చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే ప్రేమ ఇంకా బ్రతికే ఉంది అంటూ కామెంట్స్ చేసింది. ‘శాకుంతలం’ మూవీ గురించి ప్రమోట్ చేస్తూ సమంత ఎంత కష్ట పడుతున్నా ఈసినిమాకు అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల విషయంలో చెప్పుకోతగ్గ స్పందన కనిపించక పోవడం ఈమూవీ నిర్మాతలను బయ్యర్లను కలవర పెడుతున్నట్లు టాక్.
దీనితో ఈసినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షోలు వేసి ఈమూవీని విడుదలకు ముందే ప్రముఖులకు అదేవిధంగా మీడియాకు చూపెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ ఈమూవీ నిర్మాతలకు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఇదే టెక్నిక్ ను గతంలో ‘బలగం’ విషయంలో అనుసరించి సూపర్ సక్సస్ సాధిస్తే ‘రంగమార్తాండ’ విషయంలో సూపర్ ఫ్లాప్ ఎదుర్కొనవలసి వచ్చింది. దీనితో ‘శాకుంతలం నిర్మాతలకు అన్ని విషయాలలోనూ కన్ఫ్యూజన్ కొనసాగుతోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి