దగ్గుపాటి హీరోలైన వెంకటేశ్, రానా కలిసి నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ఇటీవల ఓటిటిలో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో తెలిసిందే. నెట్ ఫ్లిక్స్  వేదికగా మార్చి 10న విడుదలైన ఈ వెబ్ సిరీస్ రిలీజ్ నాటి నుండే ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. సినిమాలో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉండడంతో చాలామంది సినీ రాజకీయ విశ్లేషకులు అసహనం వ్యక్తం చేశారు. అగ్ర హీరోల స్థానంలో ఉండి ఇలాంటి కంటెంట్ ని ఎలా ప్రోత్సహిస్తారు అంటూ చాలామంది ప్రశ్నలు లేవనెత్తారు. అంతేకాదు ఇకనుంచి ఓటీడీలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లకు సైతం సెన్సార్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేశారు. 

మరోవైపు ఈ సిరీస్ కి పాజిటివ్ రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. ఏకంగా నెట్ఫిక్స్ టాప్ టెన్ జాబితాలో చోటు సంపాదించుకుంది. అమెరికన్ టీవీ సిరీస్ రే డోనవన్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో విచ్చలవిడిగా  బోల్డ్ సీన్స్ , బూతులు ఉండడంతో వీటిపై నెగెటివిటీ బాగా వచ్చింది. అయినా కూడా ఈ వెబ్ సిరీస్ ఓటీడీలో సూపర్ రెస్పాన్స్ ని కనపరిచింది. అయితే తాజాగా రానా నాయుడు వెబ్సైట్స్ గురించి టాలీవుడ్ నటుడు నవదీప్ తనదైన శైలిలో స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నవదీప్ రానా నాయుడు వెబ్సైట్ గురించి మాట్లాడుతూ.." ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళకి బాగా నచ్చుతుందని చెప్పారు.. తనలాగే చాలామంది ఈ వెబ్ సిరీస్ చూసి ఆనందిస్తున్నారని అన్నారు..

అలాంటి వాళ్ళు కోట్ల మంది ఉంటారని అందుకే ఆ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్ లో ఉందని చెప్పారు.. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని తనకు మాత్రం ఈ వెబ్సైట్ నచ్చిందని తెలిపారు. వెబ్ సిరీస్ చూసామా నచ్చిందా లేదా అనేది మాత్రమే చెప్పగలం.. ఈ వెబ్ సిరీస్ ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగిన కథ కాబట్టి అలానే ఉంటుంది అక్కడికి కల్చర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. అందుకే సరదాగా వెబ్ సిరీస్ ని చూసి ఎంజాయ్ చేశా..అని క్లారిటీ ఇచ్చాడు నవదీప్. అలాగే ఈ సిరీస్ కొందరికి మాత్రం నచ్చకపోవచ్చు వారి అభిప్రాయం వాళ్లది. ఎందుకంటే ఇందులో న్యూఢిల్లీ గురించి అంతా అనుకుంటారు.. కానీ ఇందులో ఉన్న మెసేజ్ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుందంటూ నవదీప్ పేర్కొన్నాడు. దీంతో రానా నాయుడు వెబ్ సిరీస్ పై నవదీప్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: