
దీంతో డిజిటల్ రైట్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడుతున్నాయి. ఓటిటి సంస్థలు పోటీపడి కొన్ని కోట్ల రూపాయలు చెల్లిస్తూ స్టార్ హీరోల సినిమాలను డిజిటల్ రైడర్ కి కొనుగోలు చేస్తున్నాయి. వీటి ద్వారా యూజర్స్ సబ్స్క్రిప్షన్స్ భారీగా పెరిగిపోతున్నారని సమాచారం. ఇప్పుడు వీటన్నిటికీ కాంపిటీషన్ గా జియో సినిమా మార్కెట్లోకి విడుదల కావడం జరిగింది. ఈ ఏడాది ఐపీఎల్ హక్కులన్నీ జియో సినిమాని సొంతం చేసుకున్నది గతంలో హాట్స్టార్ దగ్గర ఐపీఎల్ హక్కులు ఉండేవి అయితే ఈసారి వారి కంటే ఎక్కువగా చెల్లించి మరి జియో సంస్థ వాటిని చెల్లించుకుంది.
దీంతో ఐపీఎల్ మ్యాచ్లను ఫ్రీగా చూసే సదుపాయాన్ని కల్పించింది దీంతో ఒక్కసారిగా కోట్లాదిమంది సబ్స్క్రైబర్లు జియో సినిమా యాప్ ను ఉపయోగిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరొక బిగ్ డీల్ జియో సినిమా చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ హై స్టాండర్డ్ వెబ్ సిరీస్ లని నిర్మించే వార్నర్ బ్రదర్స్ తో జియో సినిమా వాయ్ కామ్ 18 ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. వార్నర్ బ్రదర్స్ నుంచి వచ్చిన గేమ్స్ ఆఫ్ టోన్స్ సక్సేషన్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ స్టోరీస్ రిలయన్స్ వారి జియో సినిమాలో అందుబాటులో ఉన్నాయి. అలాగే హెచ్పిఓ ఒరిజినల్ మ్యాక్స్ ఒరిజినల్ వార్నర్ బ్రదర్ టెలివిజన్ సిరీస్లను కూడా ఇందులోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం.