కెరియర్ ప్రారంభం లో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ గల సినిమా లలో నటించి ఎంతో మంది ప్రేక్షకు లను కడుపుబ్బ నవ్వించి మంచి నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అల్లరి నరేష్ కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమా ల్లో నటించినప్పటికీ ప్రస్తుతం మాత్రం నరేష్ ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా నరేష్ "ఉగ్రం" అనే మూవీ లో హీరో గా నటించాడు. విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని షైన్ స్క్రీన్ సంస్థ వారు నిర్మించారు . ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ప్రమోషన్ లను నిర్వహిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే నరేష్ మరియు విజయ్ కనకమెడల కాంబినేషన్ లో నాంది అనే వైవిధ్యమైన మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకుంది. దానితో వీరి కాంబినేషన్ లో రూపొందిన ఉగ్రం మూవీ పై తెలుగు సినీ ప్రేమికల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మే 5 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: