
ఈ చిత్రానికి సంబంధించి మే 9వ తేదీన విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఒక పోస్టర్ని విడుదల చేశారు ఆ పోస్టర్ చూసిన ఒక నెటిజన్..VD -12 చిత్రం హాలీవుడ్ మూవీ ఆర్గో (ARGO) సినిమా పోస్టర్ కాపీ అంటూ తన ట్విట్టర్ నుంచి షేర్ చేశారు. ఈ రెండు చిత్రాల పోస్టర్లు కూడా ఒకేలాగా ఉండడమే కాకుండా స్టోరీ లైన్ కూడా స్పై యాక్షన్ నేపథ్యం కావడంతో ఆ చిత్రం నుంచి కాపీ కొట్టారంటూ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్విట్‌కు నిర్మాత నాగవంశి స్పందించడం జరిగింది.
మేము ఏ పోస్టర్ నుంచి కాపీ చేయలేదు కదా బట్టి పోస్టర్ అలా కావాలనుకున్నాము యాదృచ్ఛికంగా అర్గో పోస్టర్ కూడా అలాగే ఉంది అంతే అంటూ తెలియజేశారు. వీటితోపాటు మరిన్ని పోస్టర్లను కూడా షేర్ చేయడం జరిగింది నిర్మాత నాగ వంశీ. కానీ వాటి కథ కాపీ కాదు కదా మా సినిమా కూడా అంతే పోస్టర్‌ను బట్టి ఒక అంచనాకి వచ్చేయడం సరైన నిర్ణయం కాదు అంటే చెప్పుకొచ్చారు నాగ వంశీ. అయితే ఇందులో తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా పోస్టర్ కూడా ఉంది ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది