
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి సాంగ్ ఆల్రెడీ థియేట్రికల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయిందని చెప్పవచ్చు. దీంతో థియేటర్లో ఏ సినిమా చూడాలని వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా పై చిత్ర బృందం ఇప్పుడు తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ను సైతం ప్రకటించడం జరిగింది. ఈ సినిమా గ్రాండ్ అండ్ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని లాక్ చేశారు చిత్ర బృందం.
తిరుపతిలో ఈవెంట్‌ను జరపబోతున్నట్లు మేకర్ ప్రకటించడం జరిగింది తాజాగా ఈ విషయంపై కన్ఫామ్ చేస్తూ అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. జూన్ 6 వ తేదీన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లు కన్ఫామ్ చేశారు. ఈ సినిమాతో అయితే ఒక మరిచిపోలేని ట్రీట్ అందిస్తున్నామని కాన్ఫిడెంట్‌గా చిత్ర బృందం ఉన్నది. దీంతో మొత్తానికి ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ పై క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్ నటించాగా.. రావణాసురి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. జులై 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.