మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.ఇక వీరిద్దరికీ పెళ్లి జరిగిన తర్వాత దాదాపుగా 10 ఏళ్ల తర్వాత ఉపాసన తల్లి అయింది.దింతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక మరికొద్ది రోజుల్లోనే ఉపాసన ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది. అయితే తాజాగా అంతర్జాతీయ వేదిక జి 20 సదస్సుకు హాజరయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.ఇక ఈ సందర్భంగా కొన్ని షాకింగ్ విషయాలను చెప్పాడు.

 ఈ నేపథ్యంలోని తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఒక సీక్రెట్ ను రివిల్ చేశాడు రాంచరణ్. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తనకి యూరప్ అంటే చాలా ఇష్టం అని.. కానీ ఇప్పుడు జపాన్ దేశాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతుందని చెప్పుకొచ్చాడు.అక్కడి ప్రజలు సంస్కృతి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపాడు రామ్ చరణ్. దాంతోపాటు ప్రస్తుతం తన భార్య ఉపాసనకు ఏడవ నెల అని తెలిపాడు. అంతేకాదు తనకి పుట్టబోయే బిడ్డకు జపాన్ దేశంతో ఏదో సంబంధం ఉందని తెలిపాడు. అంతేకాదు ఈ మ్యాజిక్ అంతా జరిగింది  అని చెప్పుకొచ్చాడు.

దీంతో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇదిలావుంటే  ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమాని జపాన్లో విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ సమయంలో ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేయడానికి రామ్చరణ్ తో పాటు ఉపాసన సైతం అక్కడకు వెళ్ళింది. అక్కడ వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేసింది ఉపాసన.ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లిన తర్వాతే ఉపాసన గర్భం దాల్చిందని రామ్ చరణ్ తెలియజేశారు. దీంతో అక్కడికి వెళ్ళినందుకే ఉపాసన గర్భవతి అయింది కాబట్టి తనకు పెట్టబోయే బిడ్డకి జపాన్ దేశానికి సంబంధం ఉందని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: