యంగ్ హీరో సందీప్ కిషన్ కెరియర్ ప్రస్తుతం అంతగా సరిగ్గా ముందుకు సాగలేదని చెప్పవచ్చు. కానీ ప్లాప్ ,సక్సెస్ సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. తెలుగు తమిళంలో ఇదే దూకుడుతో కొంతకాలం కొనసాగిన సందీప్ కిషన్ తన కెరియర్లో కేవలం హీరో రోల్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు స్టార్ హీరోల చిత్రాలు సైతం నటిస్తూ ఉంటారు. అందుకే అవకాశం వస్తే హీరో ఇమేజ్ని పక్కన పెట్టిన తన పాత్రకు న్యాయం చేయగలడు సందీప్ కిషన్ తాజాగా స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 50వ చిత్రంలో సందీప్ కిషన్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే ధనుష్ సార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ నేపథ్యంలోనే తన 50వ సినిమాకు సంబంధించి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ బ్యానర్ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో హీరో దుశర విజయన్ , ఎస్ జె సూర్య, విష్ణు విశాల్, కాళిదాసు కూడా నటిస్తున్నారు వారితోపాటు హీరో సందీప్ కిషన్ కూడా కీలకమైన పాత్రలు నటిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సందీప్ కిషన్ అయితే ఈ చిత్రంలో తన పాత్రకు న్యాయం చేయగలరని భావించి ధనుష్ స్వయంగా ఈ హీరో పేరు సజెషన్ చేసినట్టుగా సమాచారం.

మరి ఇందులో తన పాత్ర ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి రామన్ అనే టైటిల్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. నేటి వల కాలంలో సందీప్ కిషన్ ఒక హర్రర్ చిత్రంలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: