
ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక సైతం ఇంస్టాగ్రామ్ లో ఉన్న పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు.. దీంతో ఒకరి జ్ఞాపకాలను ఒకరు చెరిపేశారు అని చెప్పాలి. అంతేకాదు ఈ మధ్యకాలంలో నిహారిక చైతన్య ఎక్కడ కలిసి కనిపించిన దాఖలాలు కూడా లేవు. నిహారిక కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమై ప్రస్తుతం తన కెరియర్ పై దృష్టి పెట్టింది. ఇక నిర్మాతగా మాత్రమే కాదు నటిగా కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇక విడాకుల విషయంపై మాత్రం అటు నిహారిక గాని మరోవైపు చైతన్య గాని ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు.
అయితే నిజంగానే నిహారికతో చైతన్యకు విడాకులు అయ్యాయి అని అందరూ నమ్మే విధంగా ఇప్పుడు మరో విషయం జరిగింది. ఇటీవలే వెంకట చైతన్య కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. అక్కడ మీడియా కంటపడ్డారు. దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారిపోయాయి. అయితే వీరితో నిహారిక ఎక్కడ కనిపించలేదు. దీంతో నిహారిక చై, తన్య మధ్య విడాకుల వార్తలు నిజమే అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. వీరిద్దరు విడాకుల గురించి స్పందించకపోయినప్పటికీ ఏదో ఒకరోజు విడాకుల ప్రకటన చేసి అందరికీ షాక్ ఇవ్వడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు నెటిజెన్స్.