తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఈ సినిమాRRR .రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన రామ్ చరణ్ కు ఈ సినిమా నటనతో గ్లోబల్ వైడ్ గా పేరు ప్రఖ్యాతలు లభించాయి. ఒకవైపు భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా అడుగులు వేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా UV క్రియేషన్ నిర్మాత విక్రమ్ రెడ్డితో కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా నిర్మించారు


వీరిద్దరూ కలిసి స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ కి వి మెగా పిక్చర్స్ అనే పేరుతో ఈ రోజున ఫస్ట్ లుక్ సినిమా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బిగ్గెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేస్తున్నామని ముందుకే అనే తెలియజేశారు.ఈ క్రమంలోనే విరు చెప్పినట్టుగానే ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తీసుకురావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సాలిడ్ ప్రాజెక్టు గురించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్  ఈ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ ది ఇండియన్ హౌస్ అనే పేరుతో విడుదల చేశారు.


డైరెక్టర్ రామ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తూ ఉండగా ఈ చిత్రం 1900  దశాబ్దంలో భారత దేశ చరిత్రలో లేని ఒక అధ్యయనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా కూడా మంచి కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకురాబోతూ ఉండడంతో కచ్చితంగా హిట్ అవుతుందని రామ్ చరణ్ అభిమానులు నిఖిల్ అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా టైటిల్ కూడా ది ఇండియన్ హౌస్ అనే పేరుతో మంచి పాపులారిటీ సంపాదిస్తోంది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: