
అంతేకాకుండా థియేటర్ లోపలికి వెళ్లేందుకు తోసుకుంటూ వెళ్లడం చూసిన వీరు వెంటనే కారు దిగి థియేటర్ మేనేజర్ ని అడిగి మూడు టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్లారట.. దీంతో మీరు ఇలాంటి సినిమాలు చూడడమేంటి అంటూ మేనేజర్ ఆశ్చర్యపోయిన టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్లారట. అప్పట్లో కామేశ్వరి అనే సినిమా అందులో ఆడుతున్నట్లు తెలిపారు.షకీలా టైటిల్ పాత్రధారి షకీలా అలా తెరపై కనపడగానే కుర్రకారుల ఆనందం పట్టలేనిది చూసిన తేజ నిజంగానే ఆశ్చర్యపోయారట.
ఆ తర్వాత తన జయం సినిమాలో కాలేజీ లెక్చరర్ పాత్రకు షకీలాను ఫిక్స్ చేశానని తేజ తెలిపారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి అభిరామ్ కథానాయకుడుగా నటిస్తున్న అహింస సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజ ఈ విషయాన్ని తెలియజేశారు. షకీలా క్రేజీ చూసి తాను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని ఎంతోమంది నటీనటులు టెక్నీషియన్లు టాలీవుడ్ కి పరిచయం చేసిన తేజ షకీలాను తెలుగు తెరకు పరిచయం చేయడం జరిగింది. ఇక ఇవే కాకుండా పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేయడం జరిగింది డైరెక్టర్ తేజ.