తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంచనాలను సృష్టించిన కృష్ణ నటుడుగా, డైరెక్టర్గా, నిర్మాతగా కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు సరికొత్త టెక్నాలజీని కూడా అందించిన ఘనతని అందుకున్నారు కృష్ణ. గత ఏడాది అనారోగ్య సమస్య వల్ల మరణించిన కృష్ణ తెలుగు సినీ పరిశ్రమలు నటశేఖరుడు ట్రెండ్ సెట్టర్గా పేరు సంపాదించారు. ఈ రోజున కృష్ణ పుట్టినరోజు సందర్భంగా కృష్ణకు సంబంధించి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


తెలుగు సినీ పరిశ్రమల సంచలనాలను సృష్టించి సూపర్ స్టార్ గా పేరు పొందాడు కృష్ణ నటుడుగా డైరెక్టర్ గా సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసి తెలుగు సినీ ప్రేక్షకులకు కౌబాయ్గా జేమ్స్ బాండ్ హీరోగా అమ్మాయి కలల రాకుమారుడిగా పేరుపొందారు కృష్ణ. కృష్ణ మొదటిసారి తొలి సోషల్ కలర్ చిత్రంగా తేనె మనసులు చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా 1965 లో విడుదలై పలు కేంద్రాలలో వంద రోజులు జరుపుకున్నది. తొలిసారి స్పై సినిమాగా గూడాచారి 116 చిత్రాన్ని తెరకెక్కించారు.

మొదటిసారి కౌబాయ్ గా మోసగాళ్లకు మోసగాడు సినిమా 1971లో కే ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ సినిమా పలు కేంద్రాలలో వంద రోజులకు పైగా ఆడింది.. హాలీవుడ్ లో విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు ఎక్కింది. ఇంకా చెప్పాలంటే మొదటి ఫ్యాన్ వరల్డ్ మూవీ అని చెప్పవచ్చు.

తెలుగు సినీ పరిశ్రమ ఎదగడానికి తన వంతు కృషి చేశారు కృష్ణ ఇతర హీరోలతో పోలిస్తే సాంకేతికంగా చాలా అడ్వాన్సులను సైతం తన సినిమాలతో పరిచయం చేశారు. మొదటిసారి 70mm సినిమా కౌబాయ్ స్పై చిత్రాలను తెరకెక్కించి రికార్డులు అందుకున్నారు అంతేకాకుండా ఎక్కువగా త్రిపాత్రాభినయం సినిమాలలో నటించిన ఘనత కృష్ణ కే దక్కింది ఒకే ఏడాది దాదాపుగా 18 చిత్రాలను విడుదల చేసి అరుదైన ఘనత అందుకున్నారు. ఇక ఇవే కాకుండా పలు రికార్డులు సైతం కృష్ణ పేరు మీద ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: