తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అంజలి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందినటువంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో అంజలి కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమా తర్వాత ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించిన ఈ నటి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగించింది. ప్రస్తుతం అంజలి ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజెర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. కియార అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాండర్ పై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మూవీ కనక అద్భుతమైన విజయం సాధించినట్లు అయితే అంజలి క్రేజ్ అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ ... కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అంజలి బోల్డ్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: