సినీ పరిశ్రమలో ఉన్న అద్భుతమై న దర్శకుల్లో మణిరత్నం ముందు వరుసలో ఉంటారు. అగ్ర నటీనటులు కూడా ఆయన దర్శకత్వం లో ఒక్కసారైనా నటించాలని అయితే కోరుకుంటారు.

భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు.ఆయనకు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ని స్టార్‌ హీరోల తో మంచి అనుబంధం కూడా ఉంది. ఇక విశ్వనటుడు కమల్‌ హాసన్‌, మణిరత్నం మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భం గా కమల్‌ హాసన్ ట్విటర్‌ వేదికగా హృదయపూర్వక నోట్ ను రాశారు. ఈ సందర్భం గా వాళ్ల అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకున్నారు.

''ఈరోజు నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే నాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు మణిరత్నం గారి పుట్టినరోజు. ఆయన తనకున్న ప్రతిభ తో కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారు. తన సినిమాలోని మాటలు, డైలాగులు మరియు విజువల్స్‌తో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తారు. నిరంతరం నేర్చుకుంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సినిమాకు ఉన్న భాష పరమైన హద్దుల్ని కూడా తొలగించారు. రానున్న తరం దర్శకులు ఎంతో మందికి ఆయన ఆదర్శం. మీరు సాధించిన ఈ ప్రేమాభిమానాలు శాశ్వతంగా ఉంటాయి. 'నాయకుడు' సినిమా నుంచి రానున్న #KH234 వరకు సాగిన మన ప్రయాణం ఎంతో అపురూపం అని కేవలం నటనపరంగానే కాదు వ్యక్తిగతంగానూ మన ప్రయాణం ఒక వరమని ఆ దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తాను అని అందులో పేర్కొన్నారు.ఇక మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా తెలుగు మరియు తమిళ పరిశ్రమలోని వారంతా సోషల్‌మీడియాలో శుభాకాంక్షల ను తెలుపుతున్నారు. ఆయన సినిమాల్లోని సన్నివేశాలను కూడా షేర్‌ చేస్తున్నారు.మణిరత్నం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని సాధించారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కి పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సాధించాయి

మరింత సమాచారం తెలుసుకోండి: