పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఐడియా స్టార్  అనే పదానికి గుర్తింపు తెచ్చింది ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .ప్రభాస్ తోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో  పాన్ ఇండియా సినిమాలు మొదలయ్యాయి. అందుకే ప్రభాస్ ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్తుంటారు చాలామంది. తెలుగు హీరోలకి మార్గాన్ని చూపింది ప్రభాస్ అని కూడా అంటుంటారు. ఒకప్పుడు ఆయన మార్కెట్ కేవలం తెలుగు వారికే తెలుసు. కానీ ఇప్పుడు పాన్ ఇండియాలోనే అత్యధిక రమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో ఎవరు అంటే అందరూ ముందుగా ప్రభాస్ పేరే చెబుతారు.

అందరు హీరోలతో పోల్చుకుంటే ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటాడు. ఇక ప్రభాస్ సిగ్గు గురించి ప్రత్యేకంగా చెప్పగానే అవసరం లేదు. ప్రభాస్కి ఉన్నంత సిగ్గు మరి హీరోకి ఉండదు అని చెప్పాలి. అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ చాలా వినయంగా ఉంటాడు ప్రభాస్ .ఇప్పటివరకు టాలీవుడ్ లో  ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా వారి సినిమాల్లో రొమాంటిక్ సీన్లు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. కానీ మన స్టార్ హీరో ప్రభాస్ మాత్రం రొమాంటిక్ సీన్లు చేయడానికి పెద్దగా ఇష్టపడడు. కానీ ఒక సారి ఒక స్టార్ హీరోయిన్ కి లిప్ లాక్ ఇచ్చాడు ప్రభాస్. ఇంకా ఆయన సినీ కెరియర్లో అదే తన మొదటి లిప్ లాక్. 

ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క .ఇక వీరిద్దరూ కలిసి జంటగా బాహుబలి సినిమాలో నటించారు. ఈ సినిమాలోని ఓరోరి రాజా వీరాధివీరా అనే సాంగ్ చివరిలో ఇద్దరికీ లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత బలంగా చూపించాలని రాజమౌళి ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాన్ని ప్లాన్ చేశాడు. దీంతో ప్రభాస్ లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ అనుష్క శెట్టి. ఇదిలా ఉంటే ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఐడియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ఆది పురుష్ సినిమా త్వరలోనే విడుదల కు సిద్ధంగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: