తెలుగు సినీ ప్రేమికులు మూవీ బాగుంది అందులో కంటెంట్ బాగుంటే అది ఏ భాష సినిమా అనేది అసలు పట్టించుకోరు. ఏ భాష సినిమా అయినా ... ప్రేక్షకులను అలరించే విధంగా ఆ మూవీ ఉన్నట్లు అయితే దానిని అద్భుతంగా ఆదరిస్తుంటారు. అందులో భాగంగా కొన్ని తమిళ సినిమాలకు వారి ప్రాంతంలో కంటే మన ప్రాంతంలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా తమిళ సినిమాలు అయి ఉండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ లు ఏవో తెలుసుకుందాం.

సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో సూర్య ఒకరు. ఈయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఈయన కొంత కాలం క్రితం 24 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర కంటే కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్ లు వచ్చాయి.

విజయ్ ఆంటోని హీరో గా రూపొందిన బిచ్చగాడు అనే తమిళ సినిమాకి తమిళ బాక్స్ ఆఫీస్ కంటే కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్ లు వచ్చాయి.

ధనుష్ కొంత కాలం క్రితం వాతి అనే తమిళ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగు లో సార్ అనే పేరుతో విడుదల చేశారు. ఈ తమిళ సినిమాకు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంటే కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్ లు వచ్చాయి.

బిచ్చగాడు మూవీ తో మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా బిచ్చగాడు 2 అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర కంటే కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: