మరికొన్ని రోజుల్లో మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజలు మూగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. కాగా జూన్ 9వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా పెద్దల సమక్షంలో రింగులు మార్చుకోబోతున్నారు. అయితే ఎంగేజ్మెంట్ కి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం పెన్షన్ పడుతున్నారు అంటూ ఒక వార్తా సోషల్ మీడియా చక్కర్లు  కొడుతుంది.


 అయితే ఈ టెన్షన్ ఇప్పటినుంచి కాదు.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటాను అంటూ ఇక మెగా పెద్దల ముందు ప్రపోజల్ పెట్టినప్పటి నుంచి ఇక మెగా ఫ్యామిలీలో భయం మొదలైంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ టెన్షన్ వెనుక పెద్ద కారణమే ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల విషయంలో ఒక సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. అదేంటంటే చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్నారు. మెగా ఫ్యామిలీలోనే పవన్, రేణు దేశాయ్ కూడా పెళ్లి చేసుకొని కొన్నాళ్లకే విడిపోయిన సంగతి తెలిసిందే.  ఇక నాగచైతన్య సమంత వ్యవహారం కూడా ఇలాగే విడాకుల వరకు వచ్చింది.


 సాయి ధరంతేజ్, రెజీనా కూడా ఇలా ప్రేమించుకున్న కొన్ని రోజులకే బ్రేకప్ వరకు వచ్చేసారు. దీంతో ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ విషయంలో కూడా ఇలాంటి బ్యాట్స్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని మెగా ఫ్యామిలీలో అందరూ టెన్షన్ పడుతున్నారట. ఒకవేళ గతంలో పవన్ కళ్యాణ్ కు నాగచైతన్యకు జరిగినట్లుగానే ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ కి కూడా జరిగితే ఎలా అని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే పెళ్లికి ముందే అటు లావణ్య త్రిపాఠి కి ఈ భయంతో ఎన్నో కండిషన్లు కూడా పెడుతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే ఇంతకుముందు సినీ సెలబ్రిటీలలా కాకుండా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎప్పటికీ అన్యోన్యంగా ఉంటూ టాలీవుడ్ క్యూట్ కపుల్ గా మారిపోవాలని మెగా ఫాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: