మెగా హీరో నాగబాబు నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. నాగబాబు నటించిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కీలకమైన పాత్రలోనే నటిస్తూ ఉంటారు.గత కొద్దిరోజులుగా ఎలాంటి సినిమాలలో నటించలేదు దీంతో సినీ ఇండస్ట్రీకి ఆయన దూరం కావాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.కానీ ఇటీవల ఆయన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రకారం నాగబాబు ఇకపై సినిమాలకు పూర్తిగా దూరం కాబోతున్నారని అయితే ఈసారి నాగబాబు తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ కోసమే ఇలా చేయబోతున్నట్లు సమాచారం.


ఏదో ఒక సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించిన నాగబాబు కొత్త సినిమాలు చేయకపోవడానికి ఇంట్రెస్ట్ చూపలేదట. జనసేన పార్టీలో అత్యంత క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు నాగబాబు. పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే నాగబాబుకు జనసేన పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన పదవిని కూడా అప్పజెప్పినట్టు తెలుస్తోంది. అందుకే పార్టీని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి విస్తృతంగా ప్రచారం చేయడానికి పలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలలో పరిమితం కావాలని నాగబాబు ఇలా చేస్తున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి.


ఈ కారణంగానే సినిమాల నుండి ఎన్ని ఆఫర్లు వస్తున్న సరే నాగబాబు నో చెబుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..ఎలక్షన్లకు కేవలం ఏడాది కాలమే ఉన్నందువలన అప్పటివరకు మాత్రం ఆయన సినిమాలకి దూరం కానున్నారా లేకపోతే పూర్తిగా సినిమాలనే వదిలేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.. పూర్తిగా రాజకీయాలలోకి నాగబాబు వెళ్లి సినిమాలకి నో చెబుతున్న నేపథ్యంలో అభిమానుల తీవ్ర నిరాశతో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒంటరిగా పోరాటం చేయకుండా కేవలం టిడిపి పార్టీకి మద్దతుగా నిలుస్తానని చెప్పడంతో పవన్ అభిమానులు కూడా నిరుత్సాహంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలని అభిమానులు ఎంతో కలగంటున్నాప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం టిడిపి పార్టీకి సపోర్టుగా ఉంటానని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: